*కాళీ తత్వము
- విశ్లేషణ :
కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.
ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.
'సైషాప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే' అంటుంది దేవీ సప్తశతి.అంటే ఆ దేవి ప్రసన్నురాలై వరదాయిని అయినపుడు మానవుడు మోక్షాన్ని పొందగలడు.దుర్లభమైన మోక్షమే సాధ్యమైనపుడు ప్రాపంచిక కోరికలు తీరవా?చాలా తేలికగా తీరుతాయి.కోహినూర్ వజ్రమే చేతిలో ఉన్నవానికి గులకరాయి దొరకదా? ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.
వివేకానందస్వామి ఇంకా నరేంద్రునిగా ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకు ధ్యానంలో ఒక దర్శనం కలిగింది. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్ల వయసు ఉండవచ్చు. ఆయనకు కాళీమంత్ర బీజాక్షరాలు జ్యోతుల మాదిరి వెలుగుతూ దర్శనం ఇచ్చాయి.సామాన్యంగా ఇటువంటి స్థితిలో కుండలినీ ప్రబోధం కలుగుతుంది.వెన్నెముక క్రింద భాగంలో కరెంటుషాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.అలాగే వెన్నెముక గుండా ఏదో జరజర పాకినట్టు అనిపిస్తుంది.స్వామి సత్యానంద సరస్వతికి మొదటిసారి కుండలిని ప్రబోధం కలిగినపుడు తన కాళ్ళ క్రింద భూమి చీలిపోయి తానేక్కడికో పాతాళంలోకి పడిపోతున్నట్లు అనుభవం కలిగింది.
కొందరికి ఇతరదర్శనాలు కూడా కలుగ వచ్చు.మరింత అదృష్టవంతులకు కాళీమాత నిజదర్శనం కలుగవచ్చు.అది ఒక్కొక్కరి కర్మ పరిపక్వతను బట్టి, మానసిక పవిత్రతను బట్టి, మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది. కాళీమాత దర్శనం కలిగితే అది తట్టుకోవటానికి చాలా చాలా సాధన కావాలి. అది అంత తేలికైన విషయం కానే కాదు.
కాళీమాతకు, *కుండలినీశక్తికి* సంబంధం ఉంది.ఎలాగంటే,.ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలినీ రూపంలో నిద్రాణస్థితిలో ఉంటుంది. సూక్ష్మభూమికలను చూడగలిగే అంటే ఫీల్ అవగలిగే శక్తిలేక పోవటమే "నిద్రాణస్థితి" అంటే. కాళీ మంత్రసాధకులకు కుండలినీ జాగరణ దానంతట అదే సులభంగా జరుగుతుంది. కాళీమంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొలుపుతుంది. నిద్రాణంలో ఉన్న కుండలినీశక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది.
కాళీమాత మొల చుట్టూ మానవ ఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది. మన దేవీదేవతల చిత్రాలు అన్నీ గూడార్ధసంకేతాలు.ఆచిత్రాల వెనుక రహస్యమైన అర్థాలు దాగి ఉంటాయి.దీని అర్థం ఇప్పుడు వివరిస్తాను. మనుషులు పని చేసేది చేతులతోనే. చెయ్యి లేనపుడు మానవుడు ఏపనీ చెయ్యలేడు.అనగా క్రియాశక్తికి సంకేతం మానవుని చెయ్యి. ప్రపంచంలోని అందరు మానవుల చేతుల ద్వారా పని చేయిస్తూ తాను మాత్రం కనపడకుండా దాగిఉన్న శక్తి కాళిమాత.
ఇంకొక గూడార్థం.మానవుడు పూర్తిగా క్రియాకలాపాలు మాని, అనగా తన స్వంత ప్రయత్నాలు మానేయడమే తెగిపోయిన చేతికి సూచన.అంటే రమణమహర్షివలె పూర్తిగా భగవంతుని పైన ఆధారపడి,కర్మను పూర్తిగా విసర్జించినవాడే జగన్మాత ఒడిలోకి చేరుకోగలడు.వేదం కూడా ఇదే చెబుతున్నది. "నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేనమృతత్వ మానశు" మనిషి కర్మవల్ల కాదు, సంతానంవల్ల కాదు, ధనంవల్ల కాదు-- ఒక్క త్యాగంవల్ల మాత్రమే అమృతత్వాన్ని పొందగలడు.ఈవిధంగా,తెగిన చేతులు కర్మత్యాగాన్ని సూచిస్తున్నాయి.కర్మత్యాగియే మాత ఒడికి చేరుకోగలడు.ఇట్టి కర్మత్యాగం అందరికీ సాధ్యం కాదు అని అంటారా? సాధ్యంకాదు కనుకనే కాళీమాత దర్శనం కూడా అందరికీ సాధ్యం కాదు.
మాత మెడలో పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలు. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుత అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు.మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది. అక్షరములు శబ్ద రూపములు.కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో "వాగర్థా వివ సంపృక్తౌ....." శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు. అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.
పుర్రెలు శాశ్వతత్వానికి సూచన.ఎందుకని?మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి.మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్ష కారాంతమయి. *వర్ణమాల* అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై *sir John woodroffe(Arthur Avalon)* ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు *The Garland of Letters.* అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.
ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి.కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు. మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు వైబ్రేషన్లుగా ఉంటాయి.సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే.కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.
ఈ అక్షరబీజముల మంత్రజపంతో కుండలినీ సాధన చెయ్యటాన్ని రహోయాగం అంటారు.ఇది శ్రీ విద్యోపాసనలో అంతర్యాగ విధానం. అంటే బాహ్యంగా చేసే యాగంవంటిదే లోపల్లోపల చేసే అంతర్యాగ క్రమం.దీనిని చేసేవారిని గుప్తయోగులు/యోగినులు అంటారు.అంటే వీరు సాధనచేసే విధానం బయటకు కనిపించదు.దీనిని వివరిస్తూ లలితాసహస్రనామం "రహో యాగ క్రమారాద్యా రహస్తర్పణ తర్పితా" రహోయాగక్రమంలో ఆరాధించబడేదానవు, రహస్సు అనబడే తర్పణముతో తడిసిన దానవు అయిన నీకు ప్రణామము- అంటూ మాతను ప్రార్ధిస్తుంది.
జ్యోతిషవిజ్ఞానంలో శాక్తేయ పరిహారాలలో శనిభగవానుని పీడలకు కాళీ ఉపాసన చక్కని ఉపాయం.కారణమేమంటే శని భగవానుడు యమునికి సంకేతం.యముడు కాలస్వరూపం.కాళిమాత కాలమునే సంహరించగలదు. కనుక శనిదశలో వచ్చే బాధలకు, ఏలినాటి శని మొదలైన గోచారబాధలకు కాళీ ఉపాసన శ్రేష్టం.కాని దీనికి ముఖ్యంగా నియమనిష్టలతో కూడిన జీవితం, అహంకారంలేని జీవితం గడపవలసి ఉంటుంది.అపుడే మాత అనుగ్రహం త్వరగా కలుగుతుంది.నియమం తప్పితే ఫలితాలు దారుణంగా ఉంటాయి. తంత్రం శివుని మహాకాలుడు అంటుంది, శక్తిని కాళి అంటుంది. ఉజ్జయినిలోని శివునికి మహాకాలేశ్వరుడు అని పేరు. కాళి అనగా కాలము అని అర్థం. కాలానికి అధిపతి కాలేశ్వరుడు. లేక మహాకాలుడు. కాలాధీనం జగత్సర్వం, అంటే సర్వ ప్రపంచం కాలానికి లోబడి నడుస్తున్నది. కాలము అంటే ఏమిటి? మన భూమి వరకూ చూస్తె, సూర్యోదయం సూర్యాస్తమయం తో కలుగుతున్న రోజులు,నెలలు,ఋతువులు,సంవత్సరాలు వెరసి కాలం ముందుకు నడుస్తూ మానవుని ఆయుస్సు నశిస్తూ ఉంటుంది.ఇదే కాలం.
భగవత్ గీతలో భగవంతుడు "కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవ్రుద్దో'" అంటూ లోకాన్ని నాశనం చేసే కాలాన్ని నేనే అంటాడు. ఆ భయంకర విశ్వరూపాన్ని చూడలేక భయభ్రాన్తుడై అర్జునుడు ఆ రూపాన్ని ఉపసంహరించి ఎప్పటిలాగే సుమనోహరమైన కృష్ణరూపంలో దర్శనం ఇమ్మని వేడుకుంటాడు.తెలిసిన వారు కాళియే కృష్ణుడు అని అంటారు.
శ్రీ రామకృష్ణులు భక్త రాంప్రసాద్ వ్రాసిన ఒక గీతాన్ని చాలా సార్లు పాడేవారు. "అమ్మా. ప్రపంచం అనే సంతలో నీవు గాలిపటాలు ఎగుర వేస్తున్నావు. అవి రంగురంగులుగా ఉండి రకరకాల ఎత్తులలో ఎగురుతూ ఉన్నాయి. లక్షలో ఒకటోరెండో దారం తెంచుకొని గాలికి ఎగిరి కనపడని సీమలకు వెళ్ళి పోతున్నాయి.వాటిని చూచి నీవు చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నావు." అంటూ ఆ గీతం సాగుతుంది. ఈ గీతం మనం అనుకుంటున్న విషయాన్నే మార్మికంగాచెబుతున్నది.
ఈ సృష్టి జగన్మాత లీల. ఇదంతా ఒక ఆట. ఇందులోని కోట్లాది జీవులలో ఒకరో ఇద్దరో మాయా బంధాలు తెంపుకొని ఎగిరిమోక్షాన్ని చేరుకుంటున్నారు. అంటే ఇంద్రియాతీత, మనోతీత, గుణాతీతస్థితికి చేరుతున్నారు.వారే కాలానికి అతీతస్థితికి చేరుతున్నారు.అంటే కాళి వారికి తనదే అయిన ఇంకొక స్థితిని, అనగా నిశ్చల సమాధిలో నిమగ్నుడై త్రిగుణాతీతుడైన శివస్వరూపస్థితిని అనుగ్రహిస్తున్నది.అచలతత్వరూపంగా విరాజిల్లుతున్నది కూడా జగన్మాతయే గనుక ఆమె అనుగ్రహం లేనిదే అట్టి స్థితి ఎవరికీ అందదు. కాళి ఎందుకు నల్లగా ఉంటుంది? శ్రీ రామకృష్ణులు దీనికి చక్కని వివరణ ఇచ్చారు. నీవు దూరంగా ఉండిచూస్తె ఆమె నల్లగానే కనిపిస్తుంది.సముద్ర జలం దూరంనించి చూస్తే నీలంగా ఆకుపచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది.అదే దగ్గరికిపోయి చేతిలోకి తీసుకొని చూస్తే దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది. అలాగే ఆకాశం నీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.కాని మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని దగ్గరగా చూస్తె దానికి ఏరంగూ లేదు అని తెలుస్తూంది.అలాగే కాళీమాత దూరం నుంచి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని దగ్గరగా చూస్తె, ఆమెకు ఏ రంగూ లేదు అని, అన్ని రంగులూ ఆమెవే అనీ తెలుస్తూంది. అంతే కాదు శక్తీ ఆమెయే, శివుడూ ఆమెయే అన్న సత్యజ్ఞానం కలుగుతుంది. సృష్టి లో అనంతమైన ప్రతిదీ నీలంగానో నల్లగానో ఉంటుంది. ఉదాహరణకు ఆకాశం, సముద్రం మొదలైనవి.అంటే ఈ రంగులు అనంతతత్వాన్ని,రహస్యమైన శక్తినీ చూపుతాయి. నేటి భౌతికశాస్త్రం కూడా సృష్టిలో అల్టిమేట్ ఎనర్జీని డార్క్ ఎనర్జీ అని తలుస్తూ దానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. అందుకనే కాళిమాత నల్లని రంగులో ఉన్నట్లు తంత్రం దర్శించింది.
కాళికా దేవిని భయంకరంగా ఎందుకు చిత్రిస్తారు? సౌమ్య మూర్తిగా ఉండవచ్చు కదా? అని కొందరు అడుగుతారు. దీని వెనుక కొన్ని మౌలికమైన మనస్తత్వ అంశాలు దాగి ఉన్నాయి. ఈ ప్రశ్న చాలా సమంజసం గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంతా సవ్యం గా జరగటం ఇష్టంగా ఉంటుంది. ఎక్కడా ఏ విధమైన నాశనం, ధ్వంసం లేకుండా హాయిగా సాగి పోవాలని ప్రతి మనిషి, జంతువు, పక్షి, క్రిమి కీటకాలతో సహా సమస్త ప్రకృతి కోరుకుంటుంది.
కాని ప్రకృతి లో ఉన్న నియమం ప్రకారం ఎల్లకాలం అన్నీ హాయిగా సాగిపోవటం కుదరదు. కొంత భాగం ధ్వంసం అయితే గాని మరికొంత భాగం నిర్మాణం జరుగదు. కనుక ప్రకృతిలో సృష్టి, స్థితి, లయం ఈ మూడూ ఇమిడి ఉన్నాయి. ఒక్క మన సనాతన ధర్మములోనే విధ్వంసం కూడా భగవంతుని పనే అని అర్థం చేసుకోవటం జరిగింది. ఇతర మతాలలో దీనిని గ్రహించలేక, నాశనం చెయ్యటం సైతాను పని అని భావించి సైతాను అనే ఒక కల్పిత వ్యక్తిని సృష్టించుకొని దానిని సమర్ధించు కోడానికి అనేక కల్పిత కథలు అల్లుకున్నారు.
సృష్టించటం దేవుని పనైతే మరి నాశనం చెయ్యటం ఎవరి పని? అది కూడా ఆయన పనే. ఎందుకంటే ఆయన/ఆమె తప్ప ఇంకొకరు దీనికి బాధ్యులు కాలేరు. సైతాను అనే వాడు నిజానికి లేడు. అతనే ఉంటే దేవుని ఉనికికి, ఈశ్వరత్వానికి సవాలు. అటువంటి సైతానును దేవుడు తన సృష్టిలో ఎందుకు ఉండనిస్తున్నాడు అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. ఇతర మతాలు దీనిని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నాయి. కనుకనే చావు అనేది సైతాను కార్యం అని నమ్ముతూ, మరణం అంటే భయం కలిగి ఉంటాయి.
కాని మన ధర్మంలో పుట్టుక, పెంపుదల, మరణం మూడూ ప్రకృతి సహజ మైన పనులు గా అర్థం చేసుకోవటం జరిగింది. మరణం మళ్ళీ పుట్టుకకు దారి తీస్తుంది అన్న సత్యం కూడా మనవారు అర్థం చేసుకున్నారు. కనుక సృష్టి మాత్రమె కాదు, నాశనం చెయ్యటం కూడా చేస్తున్నది దేవుడే. అందుకనే కాళీ మాత ఆకారంలో శాంత ( Benign) మరియు ఘోర ( Terrible) ప్రకృతులు కలిశి ఉంటాయి. సృష్టిస్తున్నదీ నీవే, పెంచుతున్నదీ నీవే, సంహరిస్తున్నదీ నీవే అనే భావం తో కూడిన స్తుతులు ఎన్నో మనకు దేవీ మహాత్యం లో కనిపిస్తాయి.
కాళీమాత ఆకారం ప్రకృతిలో ఉన్నటువంటి, మరియు జరుగుతున్నటువంటి సత్యమైన పరిస్థితి కి అసలైన ప్రతిబింబము. శ్రీ రామకృష్ణునికి ఒకరోజు మాయా శక్తి ని చూడాలని కోరిక కలిగింది. వెంటనే ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో గంగా నదిలోనుంచి ఒక నిండు గర్భిణి నిదానంగా బయటకు రావటం ఆయన చూచారు. ఇంతలో ఆమెకు నెలలు నిండి చక్కని బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను ముద్దు చేస్తూ లాలిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆమె రూపం నల్లగా భయంకరం గా మారిపోతుంది. ఆ బిడ్డను తానె కరకరా నమిలి ముక్కలు చేసి తినేస్తుంది. తిరిగి నదీ గర్భం లో ప్రవేశించి మాయం అవుతుంది. ఈ దర్శనం ద్వారా ప్రకృతిలో ఉన్న సృష్టి, స్థితి, సంహార తత్వాల స్వరూపం ఆయనకు అవగతం అయింది.
ప్రకృతిలో సంహార తత్త్వం అంతర్లీనం గా ఉన్నది. దానిని మనం మార్చలేము. ప్రకృతి మన ఇష్ట ప్రకారం మారదు. భగవంతుడు మన ఇష్ట ప్రకారం లోకాన్ని నడుపడు. వినటానికి బాధగా ఉన్నా ఇది ఒప్పుకోక తప్పని సత్యం. సృష్టిలో ఇమిడి ఉన్న ధర్మం. దైవత్వం అంటే ఒక్క సౌమ్య తత్వమే కాదు. ఘోరమైన తత్వమూ దానిలోనే ఉన్నది. దీనికి మనం ఏమీ చెయ్యలేము. ప్రాచీనులు దీనిని అర్థం చేసుకున్నారు గనుకనే కాళీ రూపం సౌమ్యభయానక సమ్మేళనం గా ఉంటుంది.
కాళి అనగా ఒక క్షుద్ర దేవత అని తప్పుడు భావన ప్రపంచంలో ఉంది. దీనికి చాలా వరకు మన కథలు, సినిమాలు నమ్మకాలు కారణం. పాశ్చాత్యుల తప్పుడు ప్రచారం కూడా ఒక కారణం. కాని అసలు నిజం అది కాదు.
కాళి గురించి తెల్సుసుకోవాలంటే తాంత్రికులను అడగాలి. ఎందుకంటే ఆమె తాంత్రికులకు ఇష్ట దేవత. ఆమె గురించిన రహస్యములు అన్నీ తంత్ర గ్రంథములలో నిక్షిప్తములై ఉన్నాయి.
నవీన కాలములో కాళీ ఉపాసన ను పునరుజ్జీవింప చేసిన వారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఆయన ఇచ్చిన వివరణలు వేద, వేదాంత, తంత్ర, పురాణములకు అనుగుణంగా ఉన్నాయి. సర్వ ఆమోదయోగ్యం గా ఉన్నాయి.
ఒకరోజు హజరా అనేవాడు కాళి తామసిక దేవత అని విమర్శిస్తాడు. అది విని శ్రీ రామకృష్ణుడు బాధ పడి కాళీ మాతనే అడుగుతాడు. అప్పుడు మాత ఆయనతో "వాడి మాటలు పట్టించుకోకు నాయనా. వాడొక మూర్ఖుడు. వాడికేమి తెలుసు? అని ఓదారుస్తూ తామసిక, రాజసిక, సాత్విక గుణములూ తానేనని, అలాగే గుణాతీత నిరాకార నిశ్చల పరబ్రహ్మమూ తానె అన్న అనుభవాన్ని దర్శనాన్ని ఆయనకు కలిగిస్తుంది.
శ్రీ రామకృష్ణ పరమహంస కాళీ మాతగురించి ఇలా చెప్పారు.
బ్రహ్మము నిశ్చలము. త్రిగుణాతీతము. శక్తి చలన శీలము మరియు త్రిగుణాత్మిక. బ్రహ్మము శక్తీ ఒకటే. ఒక కోణమున అదే బ్రహ్మము. ఇంకొక దృష్టిలో అదే శక్తి.
కాళికాతత్వాన్ని తెలుసుకోవలేనంటే శ్రీరామకృష్ణుని మాటల్లోనే తెలుసుకో గలము.సాక్షాత్ అవతారమూర్తి చెప్పినమాటల కంటే అధికారిక వివరణ ఇంకొకటి ఉండబోదు.కాళీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామకృష్ణుడే. దక్షిణేశ్వర కాళికాలయంలో ఉన్న కాళీమూర్తి ఆయన మాటలకు స్పందించింది.నైవేద్యం పెడితే తిన్నది.సందేహాలకు తల్లిగా సమాధానం చెప్పింది.నిరాశలో ఓదార్చింది.సమస్త దివ్యానుభవాలను అలవోకగా ప్రసాదించింది.గొప్ప గురువులను రప్పించింది.ఆయా సాధనామర్మాలు తానె చెప్పి చేయించింది. సిద్ధిదాత్రియై అనుభూతులను ఇచ్చింది.
వివేకానందుడు కల్లోలస్థితిలో ఉన్నపుడు శ్రీ రామకృష్ణులు ఆయన్ను దేవాలయానికి పోయి కాళీమాతనే ఏమికావాలో అడుగమని చెబుతారు. నరేంద్రుడు ఆలయంలో ప్రవేశించి కాళీవిగ్రహం ఎదుట నిలువగానే ఆయనకు కాళీమాత సజీవంగా పీఠంపై నిలబడి దర్శనం ఇచ్చింది. ఆ ప్రేమమయ తెజోమూర్తిని చూచిన నరేంద్రుడు తన లౌకికసమస్యలను మరచి శుద్ధభక్తిని వైరాగ్యాన్ని మాత్రమె కోరి తిరిగి వెనుకకు వస్తాడు.

అద్భుతమైన ఆధ్యాత్మికత కాంతి కిరణ కృష్ణ ప్రియ ఆశీర్వాదం. ఈరోజు నా జన్మ ధన్యం మహా అదృష్టం. ఇంత వరకూ..ఇంత వివరంగా చదివి. విని ఉండలేదు. ముఖ్యంగా నాకు సంబంధించిన ఒక ముఖ్య విషయం చెప్తాను. నాకు నా 21 వ సంవత్సరంలో వయస్సు లో.
ReplyDeleteకలకత్తా లో. బిర్లా ప్లానేటోరియం లో(.నక్షత్ర శాల)లో ఉన్న సమయాన. ఆ మహా కాళీ మాతా ప్రత్యక్ష రూపం దర్శనం ఇచ్చింది.