రస వాదము / హేమ తారక విద్య :
ఇతర ధాతువులను బంగారంగా మార్చే విద్యను "వాద విద్య" అని సంస్కృతం లోనూ, "వగార విద్య" అని తెలుగు లోనూ, మార్మికుల పరిభాషలో "రసవాదం" గానూ వినుతి కెక్కింది.
"హేమకార విద్య ఎరిగిన వారెల్ల వెతలుడని యట్లు విద్య చేత తత్త్వమెరుగు తనకు చింతేలరా
విశ్వదాభిరామ వినురవేమ"
అంటాడు వేమనాచార్యుడు.
అసలు..... బంగారం 5 రకములు.
1. ప్రాకృతము : ఆదిలో బ్రహ్మచే కల్పింపబడిన స్వర్ణ బ్రహ్మము.
2. సహజము : బ్రహ్మ యొక్క జరాయువు మేరు పర్వతంపై బడి ఉద్భవించింది.
3. వహ్ని సంభము : శివుని వీర్యము, అగ్ని గ్రహించినప్పుడు జనించినది.
4. ఖనిజము : పర్వతాది గనుల యందు పుట్టినది.
5. వేధజము : స్పర్శాది వేధలచే ఏర్పడునట్టిది.
వేధజము చాలా పవిత్రమైనది.
హేమతారక విద్యలో ముఖ్యంగా 5 విధానాలున్నాయి.
1. లేపవేధ 2. క్షేపవేధ 3. కుంత వేధ 4. ధూమవేధ 5. శబ్ద వేధ.
ఈ ఐదవదగు "శబ్దవేధ" రహస్యాన్ని సక్రమంగా గ్రహించి, సాధించి నట్టిదే "మహావేధ".
అయితే బంగారం సాధించడం అంత సులువు కాదు. అందుకే "వాది కాక వేదాంతి కాడు" అన్న నానుడి పాత తరం వారికి తెలుసు. ఈ తరం వారికి అంతగా తెలియదు. అలాగే "వాద భ్రష్టః వైద్య శ్రేష్ఠః" అన్న నానుడి కూడా ఉంది.
బంగారం 5 విధాలు :
1. ప్రాకృతము : ఆదిలో బ్రహ్మచే కల్పించ బడిన స్వర్ణ బ్రహ్మము.
2.సహజము : బ్రహ్మ యొక్క జరాయువు మేరు పర్వతం పై పడి ఉద్భవించినది.
3. వహ్ని సంభము: శివుని వీర్యాన్ని అగ్ని గ్రహించినప్పుడు పుట్టినది.
4.ఖనిజము : పర్వతాది గనుల యందు పుట్టినట్టిది.
5.వేధజము : స్పర్శాది వేధలచే ఏర్పడునట్టిది. వేధజము చాలా పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతోంది.
హేమ తారక విద్య ముఖ్యంగా 5 రకాలు.
1. లేప వేధ
2. క్షేప వేధ
3. కుంత వేధ
4.ధూమ వేధ
5. శబ్ద వేధ
ఈ ఐదవది యగు "శబ్దవేధ" రహస్యాన్ని సక్రమంగా గ్రహించి, సాధించినట్టిదే "మహావేధ" దీని రహస్యం తెలిసిన వారు అరుదు.
మరి కొంత వివరణ :
స్వర్ణం 5 రకాలుగా ఉండును. అవి
1 - సహజము .
2 - ప్రాకృతము .
3 - వహ్నిజము .
4 - ఖనిజము .
5 - వేదజము .
బంగారము 16 వన్నెలు కలిగి ప్రకాశించుచుండును. ఇప్పుడు స్వర్ణములోని రకాల గురించి వివరణ.
బ్రహ్మాండం అవతల కోడిగుడ్డు ఆకారమున ఉండును. దీనిని "ప్రాకృతం " అని అందురు. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు.
అగ్నివలన పుట్టినది కావున "వహ్నిజము"అని అంటారు. దీనిని సేవించిన కాయసిద్ధి కలుగును.
పర్వతముల యందు పుట్టు ( ఖనిజము ) బంగారము సేవించిన సర్వరోగములను హరించును . మేరుపర్వతము పైన పుట్టు బంగారమునకు " సహజము " అని పేరు .
పాదరసమును రసవాద ప్రక్రియల యందు చెప్పబడిన విధముగా శుద్ధి యొనర్చి కొన్ని రహస్య ప్రక్రియలద్వారా బంగారం తయారుచేయుదురు. ఇది వేదముచే కలిగినది కావున " వేధజము " అని పేరువచ్చినది.
పైనచెప్పబడిన సహజము , వేదజము , ఖనిజము మూడునూ శుద్ది యొనర్చి సేవించిన అమృతముతో సమానమై, అది సేవించు మానవులకు సమస్తరోగములను పోగొట్టును . శరీరముకు ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్ఘాయువును కలుగచేయును .
దయచేసి మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వగలరు..
ReplyDeleteSend ur phone number plz
ReplyDeleteRasadam Yogalu Visit Now : https://www.ekinfonews.com
ReplyDelete