బౌద్ధం - తంత్రం రహస్యాలు


బౌద్ధం - తంత్రం : 1. శ్వేతకర్మ. దీనినే శాంతికర్మ లేదా White Magic అని అంటారు. జాతకంలోని మొండిదోషాలను తొలగించడానికి, తగ్గకుండా పీడిస్తున్న రోగాలను తగ్గించడానికి, భూత ప్రేతాలను వదిలించడానికి దీనిని వాడాలి. దీని దేవతలు తెల్లగా ఉంటారు. ఉదాహరణకు శ్వేతతార.

2. కాలకర్మ లేదా రౌద్రకర్మ. దీనిని Black Magic అంటారు. ఇతరులను నాశనం చెయ్యడానికి (మారణం) దీనిని వాడాలి. నిజానికి సాధనలో అడ్డు వస్తున్న మొండి దుష్ట సంస్కారాలను కర్మను నాశనం చెయ్యడానికే దీనిని ఉపయోగించాలి. దీనిలో ఉపాసింపబడే దేవతలు నల్లగా ఉంటారు. ఉదాహరణకు కాలతార, క్రోధకాళి, స్మశానకాళి, చిన్నమస్త, చాముండ.

3. పీతకర్మ లేదా పుష్టికర్మ. దీనిని Yellow Magic అంటారు. ధనధాన్య వృద్ధికి, సంపద వృద్ధికి, కుల వృద్ధికి, అధికార వృద్ధికి, అన్నిరకాలుగా ఔన్నత్యం కలగడానికి దీనిని వాడాలి. ఈ దేవతలు పసుపురంగులో ఉంటారు. ఉదాహరణకు స్వర్ణతార.

4.అరుణకర్మ లేదా వశ్యకర్మ. దీనిని Red Magic అంటారు. మనకు నచ్చిన స్త్రీలను, క్రూరజంతువులను, శత్రువులను వశం చేసుకోవాలంటే దీనిని వాడాలి. ఈ దేవతలు ఎర్రని రంగులో ఉంటారు. లలితాదేవి, కురుకుళ్ళ, అరుణతార మొదలైన దేవతలు ఈ కోవలోకి వస్తారు.

తెలుపురంగు శాంతికీ, నలుపురంగు మరణానికీ, పసుపురంగు వృద్ధికీ, ఎరుపురంగు సంమోహనానికీ సూచికలు. కొద్దిసేపు ఆ రంగుల మీద ధ్యానం చేస్తే వాటి ఆరాలు ఏమిటో బాగా అర్ధం అవుతాయి. చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రకృతిలో ఎర్రగా ఉన్న ప్రతిదీ మనిషిని ఆకర్షిస్తుంది. తెల్లనిది ప్రతిదీ శాంతిని కలిగిస్తుంది. ఈ రంగుల గుణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒకే తారాదేవి అయినా కూడా ఆమె ఉన్న రంగును బట్టి ఆమె మంత్రంలో ఉన్న వైబ్రేషన్ ను బట్టి ఆమె చేసే పని ఉంటుంది.

Comments