రాజ మాతంగి దేవి - Vishwagurunidhi

రాజ మాతంగి దేవి ఉపాసన యాగ శక్తి తో
జగన్ ని ap కి cm అయ్యారు
మోడీ దేశానికి ప్రదాని అయ్యారు
ఇలా ఎందరో రాజ్యధికారం పొందారు
ఆ దేవి కోసం  తెలుసుకుందాం



దశమహావిద్యల నేపథ్యం
నమామి దేవీం నవచంద్రమౌళే
ర్మాతంగినీ చంద్రకళావతంసాం
ఆమ్నా యప్రాప్తి ప్రతిపాదితార్థం
ప్రబోధయంతీం ప్రియమాదరేణ
కృతార్థయంతీం పదవీం పదాభ్యాం
ఆస్ఫాలయంతీం కలవల్లకీం తాం
మాతంగినీం సద్ధృదయాం ధినోమి
లీలాంశుకాం శుద్ధ నితంబబింబామ్

మత్స్యమాంస భక్షకుల కోసమే ఈ దేవి ఉపాసన అని అర్థం అవుతుంది. సంఘంలోని ప్రతివారిలోను, దేవతా భావాలను చొప్పించడానికి పూర్వులు ఈ ప్రక్రియను పాటించి, భేదాలూ, కత్తులూ మూటగట్టి స్వప్రయోజనాల కోసం కృత్రిమ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజల నెత్తిమీద రుద్దారు. స్వార్థ మేధస్సుల కంటే మానవుడు తప్పించుకోలేని జర, రుజ, మరణం మార్పులకోసం దేవతా రూపాలనిచ్చి, వాటి మీద గౌరవాన్ని పెంచి, భూమ్మీద ఉన్న నాలుగు రోజులూ పదార్థ త్యాగ బుద్ధిని సమాజంలో నెలకొల్పడానికి నిస్వార్థపరులైన మునులు, ఋషులు వేదవిద్యను వ్యాపింప చేశారు.

చండాల మాతంగిని యంత్రం కూడా నీలవస్త్రంలో దాచి పెడ్తారు. రుద్రయామళంలో ఈ జనని గురించి చక్కని స్తోత్రం ఉంది. మహాకవి కాళిదాసకృతమైన శ్లోకాలు శ్యామలా దండకంలో ఉన్నాయి. మత్స్యపురాణంలో అంధకాసురుని రుధిరపా చ్‌ఫైర్థమె శివునిచేత సృష్టింపబడిన మానస పుత్రిక అని వర్ణించారు.

మాతంగి దేవతను ఉపాసించి వాక్సిద్ధిని పొందవచ్చు. ఆ బిందు ప్రసారమే సోమ సూర్యాగ్నుల ప్రాదుర్భావం అయింది. ఆమె నాలుగు చేతులు, నాలుగు వేదాలు. దండ కృపాణ, పాశ, అంకుశాలు ఆమె ఆయుధాలు. అవిద్యనే పాశం. విద్య అంకుశం. కర్మరాశి దండం. శబ్ద స్పర్శాది గుణాలు కృపాణం. ఇవన్నీ కలిపి పంచ భూతాత్మికకు ప్రతీక. కదంబవనం బ్రహ్మాండానికి గుర్తు.

స్థూల రూపంలో మూర్తిగాను, సూక్ష్మరూపంలో యంత్రంగాను, పర రూపంలో భావనా మాత్రంగానూ వ్యక్తం అవుతుంది. దండానికి కాలము, కృపాణానికి క్రియ ప్రతీకలు. కృపాణానికి అర్థం మంత్రంగాను తురీయ స్థితిగా భావించాలి.

గుహ అంటే త్రికోణం. అందులో ఏకాక్షర స్థానం అయింది బిందువు. ఈ బిందువే మాతంగి. వైదికులకు సరస్వతి. ఈ దేవికి ఉన్న నాలుగు భుజాలకు బదులుగా నాలుగు స్తనాలను ఆపాదించిన చర్చ ఉంది బృహదారణ్యకంలో.

వాగ్దేవికి నాలుగు స్తనాలు. స్వాహా కార, వషట్ కార, హంత కార, స్వధా కారాలని వీటికి పేరు. మొదటి రెండింటి వలన దేవతలు, హంతకారం చేత మనుష్యులు, స్వధాకారం వలన పితరులు జీవిస్తున్నారని అర్థం.

ఈ జనని వలననే యజ్ఞయాగాది క్రతువులు పూర్తి అవుతాయి. ఈమె చేతిలో వీణను ధరిస్తుంది. నాదానికి ప్రతీకగా చిలుకకు పలుకులు నేర్పుతుంది. ‘హ్రీం” అనే బీజాక్షరాన్ని ఉచ్ఛరిస్తూ ఉంటుంది. చిలుక బీజాక్షరానికి ప్రతీక. శంఖుపాత్ర బ్రహ్మరంధ్రానికి ప్రతీక. కమలం సృష్టికీ, అమృత పాత్ర ఆనందానికి ప్రతీక. రక్తవస్త్రం అగ్నికి (జ్ఞానానికి) ప్రతీక. వాగ్దేవి వ్యాకరణరూప. శంఖం ఏకాక్షర జపంచేసే జీవునికి ప్రతీక. పల్లకి నిరుక్తం. కమల జ్యోత్న్యకు కల్ప సూత్రానికి ప్రతీక. భుజాలు నాలుగువేదాలు. మాతంగి వైభవరూపం దాల్చినపుడు సంపత్ప్రదగా అయినపుడు కమలాత్మికగా భాసిస్తుంది.

బంగారు వర్ణ శరీరంతో, విష్ణుమూర్తి ముఖాన్ని చూస్తూ వీణ వాయిస్తూ ఉంటుంది. రక్తవర్ణం గల ఎర్ర పట్టు చీర ధరించి, రత్న మణిమయ కిరీటాన్ని ధరించి ఉంటుంది. పై కుడివైపు అభయ ముద్ర వామహస్తాలు రెండింటిలో కమలాలు (తామరలు) ఉంటాయి. నాలుగు శుభ్ర గజములు తొండాలనెత్తి సువర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అరుణ కమలం ఈ దేవికి ఆసనం.  శ్రీశ్చత లక్ష్మీశ్చ పత్నౌ” అని ఈమెను పరమ పురుషుని భార్యగా వర్ణించారు. ఆమెకు సంబంధించిన రాజ్యవైభవం అశ్వ, రథ సమేతంగా ఉంటుంది. అందుకే ఈమెను రాజమాతంగి (రాజశ్యామల) అని కూడా అంటారు.

Comments