భగళాముఖీ దేవి
వైశాఖ శుక్ల అష్టమి భగలాముఖీదేవి అవతరించిన రోజు ఆరోజుని భగళా ముఖి జయంతిగా జరుపుకుంటారు. తాంత్రిక ఉపాసనలలో భగళాముఖీ దేవి స్థానం చాలా విశిష్టమైనది.
2. భగళాముఖి ఎవరు? ఆమె ఎలా ఉంటుంది ?
శక్తి విద్యాస్వరూపిణిగా అవతరించిన పది అవతారాలు దశమహావిద్యలు. ఆ పరావిద్య రూపాలైన దశమహావిద్యలలో ఒకటి భగళాముఖీ దేవి. ఆమెనే బగల,భగలా , వగళ అనికూడా అంటారు. పీతాంబర దేవి, బ్రహ్మాస్త్రరూపిణి అని అమ్మకు పేర్లు. ఆమె పసుపు వస్త్రాలను ధరించి, గదాధారిణియై మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపం లో కనబడుతుంది. కొన్ని చోట్ల అమ్మవారి రూపం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది.
3. భగళాముఖి అవతార కథ
ఒకనాడు భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించింది. బ్రహ్మ రుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతం లో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు. ఆ సమయం లో అక్కడగల హరిద్రా సరోవరం నుండీ భగళాముఖీ దేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది. దేవీ పురాణంలో చెప్పబడ్డ హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని దాటియా లోగల పీతాంబర పీఠం లో ఉంది.
భగళా ముఖి అవతారానికి సంబంధించి మరొక కథ ప్రచారం లో ఉంది. మాదనుడనే రాక్షసుడు త్రిమూర్తుల కొరకు ఘోర తపస్సుని ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడుగగా, తాను ఏది మాట్లాడితే అది సంభవించాలని అజేయమైన వాక్శుద్ధిని కోరుకున్నాడు. అందుకు త్రిమూర్తులు గత్యంతరం లేక సమ్మతించారు. వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలనూ నాశనం చేయనారంభించాడు. అప్పుడు ఉగ్రరూపిణియైన కాళిక భగళా ముఖిగా అవతరించి అతని నాలుకను ఛిద్రం చేసింది.
4. భగళాముఖి ఉపాసన ప్రభావం
శత్రువులను స్తంభింపజేయడం భగళా ముఖి లక్షణం. శత్రుపీడలు తొలగి, ప్రమాదాలు నివారించబడతాయి. భగళా ముఖీదేవిని తాంత్రికంగా కాకుండా సాత్వికంగానూ పూజించవచ్చు.
5. భగళా ముఖిని ఎలా ఆరాధించాలి
భగళా ముఖీ దేవిని తాంత్రిక ఉపాసన చేయదలచిన వారైనా, సాత్విక ఉపాసన చేయదలచినవారైనా తప్పని సరిగా గురువు అనుమతి తీసుకోవాలి. అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టించి నియమ నిష్టలతో స్తోత్రాన్ని పఠించాలి.
6. ప్రసిద్ధమైన భగళా ముఖీ ఆలయాలు
->గౌహతి లోని కామాఖ్య ఆలయం లో దశమహా విద్యల ఆలయాలు ఉన్నాయి. వాటిలో భగళాముఖి ఆలయం ఒకటి.
->హిమాచల్ ప్రదేశ్ లోని బంఖండి లో భగళాముఖి ఆలయం ఉన్నది.
->మధ్యప్రదేశ్ లోని నల్ఖెడా లోనూ దాటియా లోనూ భగళాముఖి దేవి ఆలయాలు ఉన్నాయి.
->తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోగల పాపంకుళం లోనూ, కళ్ళిడై కురిచ్చి లోనూ భగళాముఖి దేవిని దర్శించవచ్చు.
->ఉత్తర కర్ణాటక లోని సోమాల్పురా లో భగళాముఖి సిద్ధ పీఠం ఉంది. అమ్మవారు అక్కడి సిద్ధుని భక్తికి మెచ్చి స్వయంగా కొలువై ఉన్నదని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం సుమారు 300 యేళ్ళ నాటిది.
->నేపాల్ లోని పఠాన్ లో భగళాముఖి ఆలయం ఉంది.
మహా విద్యలు :-
||కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తధా
బగలా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మికా
ఏతా దశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితా||
సిద్ధవిద్యలైన దశ మహావిద్యలలోమొదటిగా కాళీవిద్యనుతెలుసుకున్నాం.రెండవదియైనతారావిద్య గురించి ఇకముందుతెలుసుకుందాం.తరింప చేయు శక్తితార.దేనినుంచి తరింప చేయటం?కష్టాలు,బాధలు, అజ్ఞానం,పేదరికం, ఆపదలు, భయాలు,తెలివితక్కువ తనం ఇత్యాదిఏకష్టం నుంచైనా తరింపచేయగలశక్తి స్వరూపిణి తారాదేవి.
ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంమొత్తం మీద అందరూ రకరకాలైనపేర్లతో ప్రార్థిస్తున్న జగన్మాతతారాదేవియే అని చెప్పవచ్చు.ఎందుకంటే ఎవరైనా కోరేదిఆపదలనుండి తరింపచేయమనీ,సుఖాన్ని ఇవ్వమనీ అంతేకదా.కనుక తెలిసో తెలియకోఅందరూ ప్రార్థిస్తున్నది ఈదేవినే.కాని ఈవిద్యను ఉపదేశపూర్వకంగా తెలుసుకుంటేఆలస్యం లేకుండా చక్కగాసూటిమార్గంలో ప్రయాణం చేసిగమ్యం చేరవచ్చు. తారామహాదేవికాళీ కంటే వేరు కాదు. ఈమెజగన్మాత రూపాలలో ఒకటి.వీరందరూ వేర్వేరు అని తలచుటతప్పు అని తంత్రములుచెప్పాయి. నిజానికి వీరందరూ ఒకే ఆద్యాశక్తి యొక్క వివిధ రూపాలు అని చెప్పవచ్చు.
మంత్ర భేదాలతో ఈ విద్య తార,ఏకజట, ఉగ్ర తార, నీల సరస్వతి అనే విధాలుగా ఉన్నది. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణాశక్తి,జ్ఞానశక్తి కలుగుతాయి.పాండిత్యాభిలాషులు సాధారణంగా తారా మంత్రోపదేశం కలిగిఉంటారు. తారానుగ్రహం వల్ల అనర్గళమైన వాక్శక్తి,మంచి జ్ఞాపకశక్తి,వాక్శుద్ధి కలుగుతాయి.ఇతర మహావిద్యల వలెకాక తారావిద్య బౌద్ధ జైనమతాలలో కూడా ప్రవేశించింది. జ్ఞానానికి అధిదేవతగా,కరుణామూర్తిగా,ఆపదలనుంచి కాపాడే దయామయిగా తారాదేవి ఆయా మతాలలోపూజించ బడుతున్నది.
తారాదేవి రూపం కొన్నికొన్నిసార్లుసరస్వతీదేవి రూపంలా ఉంటుంది.కనుక ఇద్దరూ ఒకటే అని కొందరుఅంటారు.తారా మంత్రాలలోప్రాంతీయ మంత్రాలు కొన్నిఉన్నాయి. అవి శాబరమంత్రాలవలె ఉండి చూడగానేసంస్కృత భాషామంత్రాలు అనిఅనిపించవు. అయినా కూడా ఇవిసంస్కృత మంత్రాల కంటేప్రభావవంతములు అంటారు.వీటికి అవైదికక్రియా కలాపాలతోసంబంధం ఉంటుంది. అందుకనిశిష్టాచారసంపన్నులు వీటి జోలికిపోరు.
తారా సాధకునికి చతుర్విధపురుషార్ధ
ాలు శీఘ్రంగా లభిస్తాయి.భవ సాగరాన్ని దాటి మోక్షాన్నిపొందాలంటే తారాసాధన చాలాశీఘ్ర ఫలదాయిని.తారాదేవిఇహమున భోగాన్ని,పరమునమోక్షాన్నిఇవ్వగలదు.ఈదేవి సంసారులకుసన్యాసులకు సమానంగావరదాయిని. సంసారులకుఈతిబాధలను పోగొట్టగలదు.సన్యాసులకు ఆంతరిక శత్రువులైనకామాది షడ్వర్గములనుసునాయాసంగా దాటించి మోక్షాన్ని కరతలామలకం చేయగలదు.
జ్యోతిర్విద్యలో ఈ దేవి బుధగ్రహాదిదేవతగా చెప్తారు. దానికి తగినట్లేఈమె రూపం కూడాపొట్టిగా,కొంచెం పెద్దపొట్టతో,ఎప్పుడూ నవ్వుముఖంతో ప్రసన్నంగా ఉంటుంది.బుధ గ్రహానికి కూడా ఇదే రూపంఉన్నట్లు జ్యోతిర్వేత్తలకుతెలుసుకదా. విజయవాడకనకదుర్గమ్మగా ఈనాడుపూజలందుకుంటున్న మూర్తినిజానికి తారాదేవి అనిబౌద్ధసాంప్రదాయంలో చెబుతారు.హుఎన్ సాంగ్ మన దేశానికివచ్చినపుడు, ఆయనఅమరావతివద్ద గల ధరణికోటకువచ్చి అక్కడ తాంత్రిక బౌద్ధంఅభ్యాసం చేసాడు.అప్పుడుదారిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపర్వతంపైన ఆయనకుపెద్దవెలుగు కనిపించిందని చెప్పాడు.అది తారాదేవి యొక్క తేజోరూపదర్శనం అని భావించాడు. టిబెటన్ తంత్రంలో తారాదేవిని పదహారేళ్ళ బాలికగా భావిస్తారు.ఈ భావన షోడశీ భావనకు దగ్గరిది.పదహారు కళల చంద్రుడు ఎలాగైతే పూర్ణం గా వేలుగుతూ తన చల్లని వెలుగుతో లోకానికి చల్లదనం ఇస్తున్నాడో అలాగే దేవికూడా తన చల్లని వెలుగుతో కరుణాపూరిత హృదయంతో బాధలనుంచి కాపాడుతుంది అని భావన.
ఏదైనా రెండు అవస్థలమధ్యసందిగ్దంలో పడి తీరాన్ని చేరలేకఉన్నవారికి తారాదేవి ఉపాసనచక్కని మార్గంచూపటమే గాకమార్గంలో గల ఆటంకాలనుతొలగించగలదు.సమస్యలన్నీఅనుకోకుండా దూదిపింజలవలెతేలిపోవటం తారాసాధకులకుఅనుభవంలోకి వస్తుంది.ఆపదలనుంచి తరింపచేయటంతారాదేవి ప్రధానలక్షణం.ఈమెఆకుపచ్చరంగులోనూ, కొన్ని రూపాలలోనీలం రంగులోనూ ఉంటుందనివేత్తలు చెబుతారు.
నిజానికి ఈమె ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇవ్వగలదు. ప్రసన్నమైన రూపాలనుంచి అతి భయంకరమైన రూపాలవరకూ ఏ రూపాన్నైనా ఈమె ధరించగలదు. ఉగ్రతార,స్మశానతార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి.ఆషామాషీ సాధకులు ఈ దర్శనాలు తట్టుకోలేరు.
తారాదేవిని త్రిమూర్తులకు జన్మ నిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు.తారా రూపం చాలాసార్లు ప్రసన్నంగా, కరుణామయిగా, దయాస్వరూపిణిగా ఉంటుంది. జీవులు పడే బాధలు ఆమెకు తెలుసు గనుక, దయా హృదయంతో తనను ఆశ్రయించిన వారికిఆ బాధలు పోగొట్టటానికి ఎప్పుడూ సిద్ధం గా ఉంటుంది. శివునికి కాలకూట విషాన్ని మింగిన బాధను పోగొట్టటానికిజగన్మాత తారాదేవిగా మారి ఆయనకు తన చనుబాలను ఇచ్చిందని, ఆ అమృతాన్ని తాగటం వల్లనే శివుడు ఆ భయంకరవిషం యొక్క ప్రభావం నుంచి బతికి బయట పడ్డాడని తంత్రాలలో ఒక గాధ ఉన్నది. ప్రపంచాన్ని ఉద్దరించటానికి వచ్చే ప్రవక్తలందరూ ఆమె బిడ్డలే అని బౌద్ధంలో భావిస్తారు. ఆమె 'కరుణ' అనే భావనకు ప్రతిరూపం.
హిందూతంత్రముల నుండిబౌద్ధతంత్రముల లోనికి వెళ్లిఅక్కడ అత్యున్నత స్థానాన్నిపొంది నేటికీనేపాల్,టిబెట్,అస్సాం,ఇంకాహిమాలయ సానువులలోఆరాధించబడుతున్న శక్తి--తార.మన తంత్రగ్రంధాలు అన్నీ నాశనంఅయినా అవి చాలావరకూ టిబెట్టులో భద్రంగా ఉన్నాయి. క్రీ శ 1000 ప్రాంతంలో బెంగాల్ నుండితిబెట్టుకు వెళ్లి అక్కడ మొదటితంత్రగురువుగాపరిగణింపబడుతున్న అతిశదీపాంగారుడు మొదటగాతారావిద్యను తిబెట్టుకుపరిచయం చేశాడు.
ఆయనకు తారాదేవి ప్రత్యక్షమైనీవు తిబెట్టుకు వెళ్ళటంవల్ల నీఆయువు క్షీణిస్తుంది. కాని నీవల్లకొన్ని వేలమంది జ్ఞానాన్ని పొందగలుగుతారు. నీకు ఏం కావాలి?అని కోరితే తన ఆయువు తగ్గినాపరవాలేదు. అంతమంది తనవల్లమోక్షాన్ని పొందగలిగితే చాలుఅంటూ విలువైన తంత్రగ్రంధాలనుటిబెటన్ భాషలోకిఅనువదిస్తాడు.నేడు మన దేశంలోఅగ్నికి ఆహుతి అయిన తంత్రగ్రంధాలు టిబెట్టులో భద్రంగాఉన్నాయి.వాటిని మళ్ళీ టిబెటన్భాష నుంచి సంసృతంలోకిఅనువాదం చేసేపని కొందరుచేస్తున్నారు.
హిమాలయ ప్రాంతాలలో ఇప్పటికీక్రూరమృగాలు ఎదురైనపుడుతారాదేవిని స్మరించటం వల్ల అవితొలగిపోవటం సర్వ సాధారణం.ఇవి మనం నమ్మము కాని భక్తితోఅమాయకంగా ప్రార్ధించేహిమాలయ పల్లె ప్రజలకుతారాదేవి చూపిన ఎన్నోనిదర్శనాలు ఉన్నాయి. బౌద్ధంలోతారాదేవిని అందరు బుద్ధులకుతల్లిగా భావిస్తూ ఒక భావనఉన్నది.ఎందుకంటే బుద్ధత్వం అనేస్థితి పొందినవారు తమ నిర్వాణంతాము చూచుకోకుండా లోకాన్నిఉద్దరించటానికి కరుణతో పనిచేస్తారు కనుక ఆ కరుణాభావనఅనేది తారాదేవి స్వరూపమే అనితలుస్తారు.
కనుకనే అవలోకితెశ్వరబోధిసత్వుని పక్కనే తారాదేవికొలువై ఉన్నట్లు మనం విగ్రహాలుచూడవచ్చు.దీని అర్థం ఆయనలోఉన్నటువంటి కరుణాభావమేతారా స్వరూపం అని. మనదేశంలో తారాదేవి యొక్కదేవాలయాలుబెంగాల్,అస్సాం,హిమాలయప్రాంతాలు,ఇంకానేపాల్,తిబెట్టులలోఉన్నాయి.మరి ఇప్పుడు చైనామొండి నిరంకుశత్వానికిబలైపోతున్న టిబెట్టులో ఎన్నిదేవాలయాలు,ప్రాచీన గ్రంధాలునశించి పోతున్నాయో దేవునికేఎరుక.
మన సాంప్రదాయంలో శ్రీవిద్యలో ఈదేవిని శ్రీచక్ర ఆవరణదేవతలలో ఒకరైన తారిణిగా పూజిస్తారు.

Comments
Post a Comment