దసమహా విద్యలలో ఒకరైన చిన్నమస్త దేవి - Vishwagurunidhi

దసమహా విద్యలలో ఒకరైన చిన్నమస్త దేవి :-


ఒకసారి భగవతి భవాని,జయ ,విజయలచే చెలికతైలతో మందకిని నది లో స్నానానికి వెళ్లారు. ఆ తరువాత వారికి ఆకలి  అయింది.ఆ ఆకలి తో  బాధపడుతున్నారు. అప్పుడు అమ్మవారు ఆమె శిరస్సు ను అమ్మవారు కాండించగా మూడు రక్త ధారలు వచ్చాయి. వాటి లో రెండు , చెలికతైల నోళ్లలో పడ్డాయని, మూడోది   చిన్నమస్త  అమ్మవారి నోట్లో పడింది అని పురాణాలు చెబుతున్నాయి.


రుధిర పాన ప్రియో కండిత శిరో రూపిని
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్తా నమోస్తుతే

ఓం శ్రీ వజ్రవైరోచని దేవై నమః

దశమహావిద్యల క్రమంలో మూడవ మహావిద్య వామాచారా పూజిత అయినా శ్రీ చిన్నమస్తా గా పిలవపడుతున్న శ్రీ వజ్రవైరోచనిదేవి కి నా సాష్టాంగదండప్రణామాలు ఈ అమ్మవారు చూడడానికి విచిత్రంగా ఉంటూ సాధకుడికి చిత్ర విచిత్రాలు చూపుతూ తిరిగి ఇవి శాశ్వతం కావు అన్ని చెప్పే మహావిద్య.


   
             చిన్నమస్త అమ్మవారికి ఇద్దరు సహచారికలు ఉంటారు. ఒక్కరి పేరు జయ మరొకరి పేరు విజయ(ఈ పేర్లు ప్రాంతం బట్టి మార్చుతుంటారు కొందరు కానీ నేను చెప్పేది  మాత్రం లింగ పురాణ  ఆధారితం ) రాక్షసులను చంపడానికి అమ్మవారు కాళికా రూపాని ధరించి అసురసంహారం చేస్తున్నపుడు.

                        ఈ సహచారికలు కూడా అమ్మవారికి సహాయం గా యోగిని శక్తిని ఆవాహన చేసి యుద్ధం లో సహాయం చేస్తారు. ఆలా అమ్మవారు యుద్ధం ముగించుకొని సాత్విక రూపాని ధరించి మీకు ఏ వారం కావాలో కోరుకోమని యోగినులకు అడుగగా.

                                       వారు యుద్ధం లో రాక్షస సంహారం చేస్తూ రక్తం తాగుతూ ఉన్నాం కానీ మాకు ఇంకా దాహం గా ఉందీ మా రక్తదాహాన్ని తీర్చమని అమ్మవారిని వేడుకొనగా అమ్మవారు కాపలా మాల రక్తవర్ణ దేహంతో స్త్రీ పురుష మిధునం పై వస్త్రరహితం గా ఉంటూ తన ఖడ్గం తో తన తలనరికి ఎడమచేతిలో పట్టుకొనగా అమ్మవారి మెడ నుండి రక్తపు ధరలు మూడు పాయలుగా బయటకు వచ్చిందీ ఆలా వచ్చిన రక్తాన్ని రెండు పాయలు ఇద్దరు యోగిని దేవతలకు పంచుతూ తనరక్తని తానే స్వయం గా తాగుతూ కనిపిస్తుంది.

                               ఈ అమ్మవారిని ఉపాసించే సాధకునకు అమ్మవారు ఇంద్రియాల పై విజయాన్ని కల్గిస్తుంది. అదే వామాచారం లో చాలా ముఖ్యం అదే ప్రధమ దశ లో సాధకునకు కావలసినది. చిన్నమస్తా దేవిని ఇంద్రిసోక్యం నుండి ఇంద్రియనిగ్రహం కల్గిస్తుంది. ఈ అమ్మవారిని ఎవరు ఆరాధిస్తారో వారికీ అనేక చిత్రాలు విచిత్రాలు చూపించి ఏవి శాశ్వతం కాదు అని తెలియ చెపేదే ఈ విద్య.
   

                   ఈ అమ్మవారు ఇచ్చే ఐశ్వర్య సంపదలు వర్ణనాతీతం.
ఈ అమ్మవారి అష్టోత్తర శతనామావళి స్వయం గా పరమేశ్వరుడే  చెప్పబడినది. ఈ అమ్మవారి స్తోత్ర పఠనాదులు ఉగ్ర అమ్మవారుల దేవాలయాల లో చెయ్యాలి. సాత్విక దేవతలా సమక్షం లో చెయ్యరాదు.


 తపస్సు,రాజస్సు ప్రతినిధులే అమ్మవారి సహచరులను భావించాలి. అమ్మవారు సత్వగుణానికి ప్రతినిధిలు గా భావించాలి. బ్రహ్మ,విష్ణు,రుద్ర శాస్త్రలు మూడింటి భేదనాన్ని ఈ మూర్తి ప్రకటిస్తుంది.శరీరంలో ని మణి పూర చక్రం క్రింద నాడుల్లో, రాతికామూల ముందు దాని పై చిన్నమస్త ఉంటుంది.


బృహదారణ్యకంలోని అశ్వశిర విద్య, శాక్తుల హాయగ్రీవవిద్య, గణపతి భక్తుల ఛిన్నశీర్ష గణపతి కి , చిన్నమస్తకు సంబంధముంది.


హిరణ్యకశిపుడు, వైరోచనుడు చిన్నమస్త ఉపసకులు. వజ్రనాడి లో శక్తి ప్రవాహం ఉండటంలో  అమ్మవారిని "వజ్రవైరోచని" అని పిలుస్తారు.


శ్రీభైరవతంత్రంలో సాధకుడు జీవభావాన్ని విడిచి శివ భావావాన్ని పొందుతారు అని తెలియజేస్తుంది.


వైరోచనుడు ని అగ్ని అని పిలవభడతాడు. అగ్ని స్థానమైన మణిపూర చక్రం లో చిన్నమస్త
అమ్మవారిని ధ్యానిస్తారు.

బహు మంత్రద్రష్ట, సిద్ధపురుషులైనా "కావ్యకంఠ గణపతి ముని" ఛిన్నమస్తా దేవి గురించి...


"కాళీ", "ఛిన్నమస్తా” తత్వాలు ఒక్కటే, అయితే వీరిలో కొంచెం భేదం వుంది. కాళీదేవి శరీరంలో అంతటా వ్యాపించే  "విద్యుచ్ఛక్తి"  అయితే, శరీరంలో కేవలం వెన్నుపామును - కుండలిని  "సుషుమ్నా నాడిని"  పట్టుకొని ఉండేది ఛిన్నమస్త.

పరిణామాల్ని కల్పించే  "విద్యుచ్ఛక్తి కాళిదైతే", ఆయుధంలాగా మారి  "వజ్రాయుధంగా ఉపయోగపడేది ఛిన్నమస్త".  అందుకే ఆమెకి  "వజ్రవైరోచని",  "ప్రచండ చండిక" అని,  "ఇంద్రాణి" అని,  "మధ్యమా" అని పిలుస్తారు. 

Comments